Mobile Recharge: ఎన్నికల తర్వాత మీ జేబుకు చిల్లు..పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలు..!
ఎన్నికల తర్వాత దేశంలో మొబైల్ రీఛార్జ్ పై ఎక్కువ ఖర్చు చేసేందుకు రెడీ ఉండాలని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు టారిఫ్ లను పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాయి. టెలికాం పరిశ్రమలో 15-17శాతం టారిఫ్ల పెంపు ఉంటుందని ఇటీవల విడుదల చేసిన నివేదిక పేర్కొంది.