BJP Politics: వ్యూహామా.. తప్పిదమా..? బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్!
బీజేపీలోకి కృష్ణ యాదవ్ చేరిక వాయిదా పడింది. చీకోటి ప్రవీణ్‌కు కూడా మరోరోజు జాయినింగ్ పెట్టుకోవాలని సూచించారు. హైదరాబాద్ సిటీతో పాటు కొన్ని అర్బన్ ప్రాంతాల్లో మినహయిస్తే బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం తక్కువ ఉంది. బండి సంజయ్‌తో పాటు మరికొందరు నేతలు తీసుకొస్తున్న వాళ్లను పార్టీలో చేర్చుకోవడానికి కండీషన్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ తెలంగాణ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బండి సంజయ్ చీకోటి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.