America Wild Fire : టెక్సాస్‌లో ఆగని కార్చిచ్చు.. 500కు పైగా ఇళ్లు బూడిదపాలు!
టెక్సాస్‌లో ఫిబ్రవరి 29న మొదలైన అడవి మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మహిళలు చనిపోయారు. టెక్సాస్ చరిత్రలో ఇదే అతిపెద్ద అగ్నిప్రమాద ఘటన. మంటలు ఇళ్లకు కూడా వ్యాపించడంతో 500కు పైగా నివాసాలు కాలి బూడిదయ్యాయి.