Telangana: తెలంగాణలో 608 నామినేషన్ల తిరస్కరణ..
తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ల వేయగా.. 608 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గరైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ల వేయగా.. 608 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గరైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
తెలంగాణ ఎన్నికల ప్రచారం ఇక మరింత రసవత్తరంగా మారనుంది. ప్రధాన పార్టీలకు చెందిన జాతీయ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. నవంబర్ 17వ తేదీన అమిత్ షా, రాహుల్ గాంధీలు వస్తున్నారు. బీజేపీ సభల్లో షా, కాంగ్రెస్ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు 4,798 మంది అభ్యర్థులు 5,716 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా సీఎం పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి, మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో ఫైల్ అయ్యాయి.
రంగారెడ్డి జిల్లా భీమారం గ్రామంలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. గుప్త నిధుల కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే పురాతన విగ్రహం తొలగించి ముక్కలు ముక్కలుగా చేశారు. ఇది గుర్తించిన గ్రామస్తులు.. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ఎన్నికల నేఫథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా హైదరాబాద్‌పై ఫోకస్ పెంచారు. హైదరాబాద్‌లో నో ట్రాఫిక్, నో పొల్యూషన్, 24 గంటలు తాగునీటి సరఫరా తమ లక్ష్యంగా ప్రకటించారు మంత్రి కేటీఆర్. పండుగ తరువాత ఫుల్ ఫోకస్ పెడతామన్నారు.
ఎన్నికల ప్రచారం ఖర్చుల కోసం రూ. లక్ష చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలవాలని అన్నారు. శంకరమ్మను ఉన్నత స్థానంలో చూస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాదిగలకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు మందకృష్ణ మాదిగ. నో కాంగ్రెస్.. నో బీఅర్ఎస్.. పార్టీలకతీతంగా మోదీకి అండగ నిలబడతాం అని చెప్పారు మందకృష్ణ. మా జాతి హక్కులను కాపాడాల్సిన బాధ్యత పెద్దన్నగా ప్రధాని నరేంద్ర మోదీదే అని పేర్కొన్నారాయన.
మాదిగల విశ్వరూప మహాసభలో మందకృష్ణ మాదిగ కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను ఆలింగనం చేసుకోవడంతో.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. దాంతో ప్రధాని మోదీ భుజం తట్టి ఆయన్ను ఓదార్చారు.
కరీంనగర్ నియోజకవర్గంలో ఈసారి థ్రిలింగ్ కాంపిటేషన్ ఉండనుంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న గంగుల కమలాకర్, బండి సంజయ్, పురుమల్ల శ్రీనివాస్ ముగ్గురూ మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వారే. దాంతో టఫ్ కాంపిటీషన్ కనిపిస్తోంది.