Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో నాయకులకు ఉక్కపోత.. ఎందుకంటే..
తెలంగాణ ఎన్నికలు రాజకీయ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందా? అని ఏపీలో ప్రధాన పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని వైసీపీ, కాంగ్రెస్ పార్టీనే గెలవాలని టీడీపీ భావిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.
Telangana Elections: మరికొన్ని గంటల్లో పోలింగ్.. సీఈవో వికాస్ రాజ్ సంచలన ప్రకటన..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో సైలెంట్ మెటీరియల్ ప్రారంభమైందన్నారు. ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ను ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు.
Telangana Elections: ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే!
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ సర్వే సంస్థలు ప్రీ పోల్ సర్వే రిపోర్ట్స్‌ను వెల్లడించాయి. మెజార్టీ సంస్థలు బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెబుతున్నారు. కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని కొన్ని సంస్థలు చెబుతున్నారు. అధికారం ఏ పార్టీదో తేలాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.
Telangana Elections 2023: పింఛనుదారులే బీఆర్ఎస్కు ‘ఆసరా’.. ఈసారీ గట్టెక్కిస్తారా!
పెద్దసంఖ్యలో ఉన్న ‘ఆసరా’ లబ్ధిదారులపైనే బీఆర్ఎస్ మరోసారి ఆశలు పెట్టుకుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మేనిఫెస్టోలోనూ పింఛను పెంపునకు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. ఈ దఫా వారు ఎవరికి మద్దతిస్తారన్న దానిపైనే అన్ని పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోంది: పదేళ్ల ప్రగతిపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయవద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై హోటల్ కాకతీయలో గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తలసరి ఆదాయంతో పాటు అనేక అంశాల్లో తెలంగాణ దేశంలోనే ముందుందన్నారు.
మాదాపూర్‌లో నోట్ల కట్టలు.. రూ. 5 కోట్లు ఎవరివి!
హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీగా నగదు పట్టుబడింది. మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు తనిఖీల్లో రెండు సంచుల్లో తరలిస్తున్న రూ. 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సొమ్మును ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.
వకీల్ సాబ్ ను గెలిపించండి.. బీజేపీతోనే సామాజిక తెలంగాణ: పవన్ కల్యాణ్
బంగారు తెలంగాణ పేరుతో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను మోసగించిందని, సామాజిక తెలంగాణ కావాలంటే బీజేపీని గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంటలో రోడ్ షోలో ఆయన పాల్గొని రఘునందనరావుకు మద్దతు తెలిపారు.
BJP: జెండా పాతాల్సిందే: తెలంగాణకు బీజేపీ అగ్రనేతల క్యూ.. వరుస పర్యటనలతో కార్యాచరణ
పార్టీపై సానుకూలత పెరిగిందన్న విశ్లేషణల నేపథ్యంలో తెలంగాణలో సర్వశక్తులొడ్డి ప్రజల్లోకి వెళ్లాలని కమలదళం భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ హేమాహేమీలంతా తెలంగాణకు వరుస కడుతున్నారు. చివరివారంలో బీజేపీ నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు తలపెట్టారు.