Telangana: సిరిసిల్లలో ఉంటే ఎప్పుడో క్లియర్ అయ్యేది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోట షాకింగ్ కామెంట్స్..
బీఆర్ఎస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సంచలన కామెంట్స్ చేశారు. సొంత పార్టీపైనే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకుంటే.. తానే తిరగబడి పోరాటం చేస్తానని అన్నారు. ముంపు గ్రామాలు సిరిసిల్లలో ఉంటే.. ఈపాటికి సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యి ఉండేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.