Telangana Elections 2023: కాంగ్రెస్ హవా నిజమవుతుందా?
ఓ దశాబ్ది కాలం తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ కళ మారుతోందా? రేవంత్ రెడ్డి దూకుడు ఫలితమిస్తుందా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేల వ్యూహం కర్ణాటక లాగే పొరుగు న కూడా ఫలిస్తుందా? రాజకీయ వేత్తలనే కాకుండా సామాన్య ప్రజలనూ ఆలోచింపజేస్తున్న ప్రశ్నలివి. కాంగ్రెస్లో అనైక్యత, ఎకనాయకత్వం లేకపోవడం లోపాలు అని కొందరంటున్నా.. అవే అనుకూలాంశాలుగా మారొచ్చని పరిశీలకులు అంటున్నారు.