Kodali Nani: చంద్రబాబుకు వేల కోట్లు ఎక్కడివి.?
చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల వ్యాపారంతో చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాధించారన్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని బాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల వ్యాపారంతో చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాధించారన్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని బాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
టీడీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మహిళా నేత , మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా వైసీపీ కి పంటికింద రాయిలా మారారు.
ఆయన బాబు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోనే అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు మాత్రమే అని ఆయన ధ్వజమెత్తారు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం సభలో సీఎం జగన్ ని, ఇతర వైసీపీ నేతలను పరుష పదజాలంతో దూషించారనే ఆరోపణలతో ఆయన్ని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొస్తున్నారు.
ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ ఇసుక, అక్రమ మైనింగ్‌పై తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తోంది.
జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు ముగిశాయి. చర్చలు సుహృద్బావ వాతావరణంలో జరిగాయని మంత్రి బొత్స సత్యానారాయణ వెల్లడించారు. మరికొన్ని అంశాలను చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగాయన్నారు. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పామని వెల్లడించారు. చంద్రబాబు ఢిల్లీ తిరుగుతున్నాడని అన్నారు. బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడన్నారు.
టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనకాపల్లికి చెందిన టీడీపీ నేత మలశాల భరత్ కుమార్, ఆయన తండ్రి విశాఖ డెయిరీ డైరెక్టర్ రమణారావు, ఆయన తల్లి మాజీ ఎంపీపీ ధనమ్మలు సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీలో చేరారు. వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరిలో నిలుస్తుందన్న ఆయన బీజేపీతో పొత్తులు కోసం సమయం మించిపోయిందన్నారు. అయితే తెలంగాణలో ఎన్నికల కోసం కమిటీలు వర్కౌట్ చేస్తున్నాయన్నారు. ఇక జనసేనతో పొత్తుకు ఇంకా సమయం ఉందన్నారు చంద్రబాబు నాయుడు.
గోదావరిని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలను దొచేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ ప్రభుత్వం ఇసుక విధానంలో దళితులు, బలహీన వర్గాల పొట్టకొట్టిందన్నారు. రాజమండ్రిలో ఇసుక ర్యాంపు వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఇసుక మాఫియా పై సత్య గ్రహ ధర్నా చేపట్టారు. ఈ సత్యాగ్రహ దీక్షలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.