చిక్కోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి పై వీడని సందిగ్ధత!
చిక్కోలు జిల్లాలో వైసీపీ (YCP) ని ఎంపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ శిరోభారంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇప్పటి వరకూ ఆ పార్టీకి ఎంపీ (MP) అభ్యర్థి ఖరారు కాకపోవడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
చిక్కోలు జిల్లాలో వైసీపీ (YCP) ని ఎంపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ శిరోభారంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇప్పటి వరకూ ఆ పార్టీకి ఎంపీ (MP) అభ్యర్థి ఖరారు కాకపోవడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఓటర్ పల్స్ పట్టుకోవడానికి టీడీపీ సిద్ధమైంది.. రాబోయే ఎన్నికల పై ఏపీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ప్రజలేమనుకుంటున్నారు వంటి అంశాల మీద ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసినట్లు సమాచారం.. టీడీపీ పొలిటికల్ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆధ్వర్యంలో మంగళగిరి లో పార్టీ కార్యాలయంలో దీని కోసం ప్రత్యేకంగా టీమ్ ను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాష్ర్టంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాయి. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని ప్రకటించిన టీడీపీ-జనసేన పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాయి. సీట్ల పంపకాలు, నాయకుల మధ్య సమన్వయం కోసం ఇరు పార్టీలు కమిటీలను ఏర్పాటు చేశాయి. టీడీపీతో సమన్వయం కోసం నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో గతంలోనే జనసేన పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది.
చంద్రబాబు ఆరోగ్యం మీద మాకు అనుమానాలున్నాయని ఆయన కోడలు బ్రహ్మణి చేసిన ట్విట్ కు గుడివాడ స్పందించారు. చంద్రబాబు జైలులో బరువు పెరిగారు. ఆయన ఆరోగ్యం పై అనుమానాలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
జైలులో చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదని నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు టీడీపీ ముఖ్య నేతలు అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయించారు. మంగళగిరి సెంట్రల్ ఆఫీస్ లో సమావేశమై.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, కేసుల విషయంపై చర్చించనున్నారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి (Ketamreddy vinod kumar reddy) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రేపు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరుఫున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ రెడ్డి..ఓటమి పాలయ్యారు
నిన్న సాయంత్రం అమిత్ షాతో నారా లోకేష్ భేటీ కావడం తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కోసం పురందేశ్వరి ఈ స్కెచ్ వేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో బీజేపీ, టీడీపీ పొత్తుకు ఇది సంకేతమన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను రెండో రోజు సీఐడి విచారించనుంది. నేడు మరోసారి సీఐడీ విచారణకు రావాల్సిందిగా లోకేశ్ ను ఆదేశించింది. కాగా మంగళవారం దాదాపు 6గంటల పాటు లోకేశ్ ను సీఐడీ ప్రశ్నించింది. ఆయన్ను 30 ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. విచారణకు లోకేశ్ ఏమాత్రం సహరించలేదని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి సీఐడి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలోనే నేడు సీఐడీ ముందు విచారణకు లోకేశ్ హాజరుకానున్నారు.
సుబ్బరాయుడు ఎన్ని పార్టీలు మారిన ఇప్పటికీ అతని వెంట నడిచే కార్యకర్తలు అలానే వున్నారు.. గత కొన్నాళ్ళ నుంచి సుబ్బరాయుడు సైకిల్ ఎక్కుతారు అనే ఊహాగానాలు జోరుగా ప్రచారం సాగాయి. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.ఇదంతా మరోసారి తాను రాజకీయ ఓనమాలు దిద్దిన పార్టీ అయిన టీడీపీలో చేరుతారు అనే ప్రచారం జరిగిపోతుంది.