T Congress : స్పీడ్ పెంచిన టీకాంగ్రెస్.. అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం!
T Congress MLA Candidates List :ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఎన్నికలపై చర్చించేందుకు గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్దిక్, మేవాని ఈ సమావేశంలో పాల్గొన్నారు.