తెలంగాణ దశాబ్ధ ప్రగతిపై ‘స్వేద పత్రం’.. కాంగ్రెస్ శ్వేతపత్రానికి కేటీఆర్ కౌంటర్
తెలంగాణ తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. శ్రమించి తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేశారు.