Chevella EX MLA KS Ratnam: మంత్రులు, ముఖ్యమంత్రులే పార్టీ మారారు..నేను మారితే తప్పేంటి?..కేఎస్ రత్నం ప్రత్యేక ఇంటర్వ్యూ..!!
మంత్రులు, ముఖ్యమంత్రులే పార్టీలు మారారు..నేను పార్టీ మారటంలో తప్పేంటని ప్రశ్నించారు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. తన కార్యకర్తల ఒత్తిడితోనే తాను బీజేపీలోకి చేరినట్లు వెల్లడించారు. బీజేపీమీద తనకు మొదటి నుంచి అభిమానం ఉందన్నారు. కేసీఆర్ తనను కుటుంబసభ్యుడిగా చూసుకున్నారన్న కేఎస్ రత్నం..కేసీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేయనన్నారు.