IND VS SA: నాలుగు వికెట్లు ఢమాల్.. కోహ్లీపైనే భారం!
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తడపడి బ్యాటింగ్ చేస్తోంది. 100 పరుగుల లోపే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో భారమంతా కోహ్లీపైనే పడనుంది.
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తడపడి బ్యాటింగ్ చేస్తోంది. 100 పరుగుల లోపే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో భారమంతా కోహ్లీపైనే పడనుంది.
దక్షిణాఫ్రికా ఆడిన రెండు టీ20 ఇన్నింగ్స్‌లలో ఫెయిలైన గిల్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 14 టీ20 మ్యాచ్‌ల్లో గిల్ రెండు సార్లే 50+ స్కోర్లు చేశాడు. వన్డేల్లో చెలరేగిపోతున్నా.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు.
SAపై జరిగిన మూడో టీ20లో సూర్య 100 పరుగులు చేయగా.. ప్రొటీస్ టీమ్ 95 రన్స్‌తో సరిపెట్టుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ నుంచి ఇలా ఒక ప్లేయర్ చేసిన రన్స్ కంటే ప్రత్యర్థి టీమ్ తక్కువ రన్స్ చేయడం ఇది మూడోసారి. గతంలో గిల్, కోహ్లీ సెంచరీ చేసినప్పుడు ఇలానే జరిగింది.
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా యువ ఓపెనర్ శుభమన్‌గిల్ ఎన్నికయ్యాడు. రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా రిటెన్షన్‌లో భాగంగా ముంబైకు ట్రేడ్ అయ్యాడు. దీంతో గిల్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం డిసైడ్ అయ్యింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ గిల్ నంబర్-2 పొజిషన్లో ఉన్నాడు. నంబర్-1లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఉన్నాడు. డెంగీ నుంచి కోలుకున్న తర్వాత గిల్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. క్లాసిక్ షాట్లలో ఓవైపు అలరిస్తూనే మరోవైపు ఏదో ఒక బంతికి చెత్త షాట్ఆడి అవుట్ అవుతున్నాడంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నంబర్-1 ర్యాంకును చేరుకునే అవకాశాన్ని చేజేతులా మిస్ చేసుకుంటున్నాడంటూ బాధ పడుతున్నారు.
వన్డేల్లో మరో రికార్డు బద్దలు కొట్టాడు టీమిండియా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్. తక్కువ ఇన్నింగ్స్‌లలో 2 వేల పరుగుల మైలురాయిని టచ్ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై 26 పరుగులు చేసిన గిల్ ఖాతాలో ఈ రికార్డు వచ్చి పడింది. గిల్ 38 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ నమోదు చేయగా.. దక్షిణాప్రికా క్రికెట్ దిగ్గజం అమ్లా 40 ఇన్నింగ్స్‌లలో 2 వేల పరుగుల మార్క్‌ని టచ్ అయ్యాడు.
టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్ మరో రికార్డుకు అతి దగ్గరలో ఉన్నాడు. మరో 67 రన్స్ చేస్తే దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం హషీమ్ అమ్లా రికార్డు బ్రేక్ అవుతుంది. గిల్ వన్డేల్లో 2 వేల రన్స్ మార్క్‌ను చేరుకోనున్నాడు. 36 ఇన్నింగ్స్‌లో గిల్ 1933 రన్స్ చేశాడు. అమ్లా 40 ఇన్నింగ్స్‌లో 2వేల రన్స్ చేశాడు.
టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ పాక్‌తో మ్యాచ్‌కు బరిలోకి దిగాడు. డెంగీ నుంచి త్వరగా కోలుకున్న గిల్ సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. గిల్‌కు వరల్డ్‌కప్‌లో ఇది తొలి మ్యాచ్. ఇక టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
టీమిండియా ఫ్యాన్స్‌కు శుభవార్త ఇది. వరల్డ్‌కప్‌లో భాగంగా రేపు(అక్టోబర్ 14) పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 99శాతం గిల్ పాక్‌పై పోరులో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. గత శుక్రవారం శుభమన్‌గిల్‌కి డెంగీ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.