Sajjala: టీడీపీ నేతల దీక్షలపై సజ్జల సెటైర్లు.. పూనకాలు వద్దంటూ పవన్ పై ఫైర్
చంద్రబాబు (Chandrababu) జైల్లో ఉంటే గాంధీని అవమానించేలా టీడీపీ నేతలు దీక్ష చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతలు మంచి లక్ష్యాలతో నిరాహారదీక్ష చేస్తే బాగుండేదన్నారు. చంద్రబాబు నవ నిర్మాణం అనేది ఉత్త బోగస్ అంటూ ఎద్దేవా చేశారు.