EC: ఏ ఓటరు పేరును తొలగించం.. సుప్రీంకోర్టులో ఈసీ సంచలనం
కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల బిహార్లో చేపట్టిన ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణ (SIR)పై తీవ్రంగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈసీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఓటర్ల లిస్టు నుంచి ఓటర్ల పేర్లు తొలగించారన్న ఆరోపణలను ఖండించింది.