బీఆర్ఎస్ ఓటమి ఖాయం.. కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలకు సిద్ధం కండి: రేవంత్ రెడ్డి
తెలంగాణ పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయబోతున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే అధికారమన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ కు ఓటమి తప్పదని స్పష్టంచేశారు.