Reliance AGM 2023: జియో 5G, జియో ఎయిర్‌ఫైబర్, జియో స్మార్ట్‌ఫోన్.. అంబానీ ఏం చెప్పబోతున్నారు?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ 'RIL AGM 2023' ఎల్లుండు(ఆగస్టు 28) జరగనుంది. ఈ సారి ఈవెంట్లో '5G' చుట్టూనే అంబానీ ప్రసంగం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. 5జీకి సంబంధించి కొత్త ప్లాన్లను, జియో ఎయిర్‌ఫైబర్ గురించి అంబానీ కీలక ప్రకటన చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అటు జీయో 5జీ స్మార్ట్ ఫోన్ గురించి కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.