Relationship: అబ్బాయిలూ...ఇలాంటి గుణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఉండరు..!!
పెళ్లి చేసుకునే అమ్మాయికి ఈ లక్షణాలన్నీ ఉంటే ఇల్లు, కుటుంబం సంతోషంగా ఉంటాయని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. వైవాహిక జీవితం సుఖంగా ఉండాలంటే మంచి జీవిత భాగస్వామిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. దాని కోసం పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి గురించి క్షుణ్ణంగా విచారించిన తర్వాతే పెళ్లికి ముందడుగు వేస్తారు. అందర్ని గౌరవించడం, ప్రశాంతమైన మనస్సు, ఓపిక ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆ అబ్బాయి అంత అదృష్టవంతుడు ఉండడని చెబుతున్నాడు చాణక్యుడు.