Khammam: పువ్వాడ క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించిన ఆశా వర్కర్లు
ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమకు గౌరవ వేతనంగా 18,000 రూపాయలను అందించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.