TDP-Janasena-BJP: అనపర్తి టీడీపీకే..రఘురామకు క్లీయరైన లైన్!
అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చేసేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చేసేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒంగోలు వన్ టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఇంకా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది.టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ... వైసీపీ నేత , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్ కి రాగా.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనపర్తి అసెంబ్లీ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణం రాజు ఎన్నికల ప్రచారాన్ని స్థానిక తెలుగు దేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో శివరామరాజుకి ఘోర అవమానం జరిగింది.
కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడాన్నివ్యతిరేకించిన పార్టీ సీనియర్ నేత సింగాపురం ఇందిరా నిరసనల నిర్వహణకు ప్లాన్ చేయగా.. కాంగ్రెస్ పెద్దల చొరవతో ఆమె వెనక్కి తగ్గింది. కానీ తాజాగా కడియం శ్రీహరి, ఇందిరా అనుచరుల మధ్య పార్టీలో చేరికల విషయమై మరోసారి వివాదం తలెత్తింది.
అజిత్ దోవల్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కువగా నమ్మే వ్యక్తుల్లో దోవల్ ఒకరు. యుద్ద వ్యూహాల్లో దోవల్ దిట్ట.సోషల్‌మీడియాలో అజిత్ దోవల్‌కు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. 36ఏళ్ల నాటి క్రితం రాజీవ్ గాంధీతో ఉన్న ఫొటో అది.. ఈ ఫొటో వెనుక కథేంటో ఇవాళ తెలుసుకుందాం!
The Guardian : భారత్‌లో మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్ గ్రూప్‌లు గురిపెట్టాయన్న వార్త చక్కర్లు కొట్టింది. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' నివేదిక ఈ విషయాన్ని చెబుతోంది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావలన్నది చైనా ఎత్తుగడగా తెలుస్తోంది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్....జనసేన పార్టీలో చేరుతున్నారని సమాచారం . ఇప్పటికే పవన్ తో ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఆయన జనసే కూటమి తరుఫున జనసేన అభ్యర్థిగా మండలి బరిలోకి దిగుతున్నారు.
నటుడు నిఖిల్ సిద్దార్ధ్ టీడీపీ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలను ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఆయన కేవలం మావయ్య ప్రచారం కోసం మాత్రమే చీరాలకు వచ్చినట్లు తెలిపారు. అంతేకానీ ఏ పార్టీలోనూ ఆయన చేరలేదని టీమ్ వివరించింది.
అనపర్తిలో టీడీపీ నేత నల్లమిల్లికి టికెట్ ఇవ్వాలేదని బాధతో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే... పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బీజేపీకి వెళ్లింది. దీంతో నల్లమిల్లి అనుచరులు భగ్గుమన్నారు.