PM Modi ISRO Visit : ఇస్రోలో ప్రధాని మోదీ... బృందాన్ని అభినందించిన ప్రధాని..!!
చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ISTRAC) మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌ను కలుసుకుని చంద్రయాన్-3 మిషన్ విజయవంతానికి అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన నుండి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోదీ ఉదయం బెంగళూరు చేరుకున్నారు.