Chandrababu: ఏసీబీ కోర్టులో బిజీబీజీగా చంద్రబాబు, లోకేష్
చంద్రబాబు రిమాండ్ విషయమై ఏసీబీ కోర్టులో వాదనలు ముగియడంతో కోర్టు తీర్పు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వాదనలు అనంతరం చంద్రబాబు కోర్టు లోపల కూర్చుని ఉన్నారు. చంద్రబాబుతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. మరోవైపు టీడీపీ యువనేత లోకేష్ ఓపెన్ కోర్టులో న్యాయవాదులతో చర్చిస్తూ బిజీగా ఉన్నారు.