AP Assembly: గందరగోళంగా ఏపీ అసెంబ్లీ.. ఉభయ సభల్లో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉభయసభలు ఎన్నిసార్లు వాయిదా వేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. ఉభయ సభల్లో టీడీపీ సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో సభను వాయిదా వేసి మళ్లీ మొదలు పెట్టినా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కంటిన్యూ చేస్తూ వచ్చారు.