TS New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. పేదలకు రేవంత్ సర్కార్ శుభవార్త!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. తాము అధికారంలోకి వస్తే అర్హులైనవారందరికీ కొత్త రేషర్ కార్డులు జారీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. నేడు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షించనున్నారు.