Asian Games: 9 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 34 బంతుల్లో సెంచరీ.. ఒకే మ్యాచ్లో రికార్డుల మోత
ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియా జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచులో నేపాల్ జట్టు ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రికార్డులు నమోదు చేసింది. ఆకాశమే హద్దుగా.. బౌండరీలే లక్ష్యంగా నేపాల్ బ్యాటర్లు చెలరేగిపోయారు.