School Building wall collapsed : కూలిన ప్రభుత్వ పాఠశాల గోడ.. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా బనగానపల్లె మండల హుసేనాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం మధ్యాహ్నం తరగతి గోడ ఒకటి కూలిపోయింది. అయితే ఆ సమయంలో భోజన విరామ సమయం కావడంతో విద్యార్థులు అందరూ బయటకు వెళ్లారు. అప్పుడు అక్కడ విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పెద్ద శబ్దంతో తరగతి గది గోడ కూలింది. పెద్ద పెద్ద బండరాళ్లు విద్యార్థులు ఉంచిన బ్యాగులపై పడ్డాయి. ప్రాథమిక పాఠశాలలో మొత్తం 38 మంది పిల్లలున్నారు. పాఠశాల భవనం మరమ్మత్తు చేసేందుకు నాడు నేడు కింద రూ.12.5 లక్షలు మంజూరయ్యాయి. అయినప్పటికీ పనులు మాత్రం జరగడం లేదు.