చికాగోలో ఆకలితో అలమటిస్తోన్న హైదరాబాద్ మహిళ, కేంద్రమంత్రి సహాయం కోరిన తల్లి
మాస్టర్స్ చేదివేందుకు అగ్రరాజ్యం అయినటువంటి అమెరికాకు వెళ్లిన తెలంగాణ యువతి అక్కడ రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది.ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా తన కుమార్తెను భారత్కు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ (S Jaishankar)కు లేఖ రాసింది.అక్కడ ఆ మహిళ దారుణమైన దయనీయస్థితిలో కనిపిస్తోంది.అంతేకాదు ఆమె వస్తువులన్నీ దొంగిలించబడ్డాయి.తన చేతిలో ఏమీలేక పొరుగుదేశంలో తనొక అనాథలాగా బ్రతుకుతోంది.ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.