Bommarasipeta: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి వెళ్లిన మంత్రిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పట్టాలు లబ్దిదారులకు కాకుండా తన అనుచరులకు ఇస్తున్నారని వారు ఆరోపించారు.
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి వెళ్లిన మంత్రిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పట్టాలు లబ్దిదారులకు కాకుండా తన అనుచరులకు ఇస్తున్నారని వారు ఆరోపించారు.
మా గవర్నర్ జేమ్స్ బాండ్ (James Bond) లా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి. ప్రభుత్వానికి, గవర్నర్(Governer) కు మధ్య ఉన్న చిన్నపాటి విభేదాల వల్ల వారు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది.
ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమకు గౌరవ వేతనంగా 18,000 రూపాయలను అందించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
సిద్దిపేట జిల్లా రాంపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తాము రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు మాత్రమే ఓటు వేస్తామని తీర్మానం చేశారు. ఈ తీర్మాన పత్రాలను మంత్రి హరీష్ రావుకు అందజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చూసే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
It will make no difference if people dont eat onions says Maha Minister/ స్థోమత లేని వాళ్లు నాలుగు నెలలు ఉల్లి వాడకుంటే ఏమవుతుంది... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Maharashtra BJP Minister Claims Eating Fish Make Eyes Sparkle/ ఐశ్వర్య రాయ్ లాంటి కండ్లు కావాలంటే రోజూ చేపలు తినండి... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు...!
మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. హరీష్ రావును విమర్శించే స్థాయి హనుమంతవురావుకు లేదని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు.
విశాఖ గాజువాక లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ..పవన్ మాట్లాడిన మాటలు వింటుంటే జగన్ పై ఎంత కడుపు మంటో అర్థం అవుతుందంటూ పేర్కొన్నారు.