YCP MP Sri Krishnadevaraya vs YCP MLA Vidadala Rajini: పల్నాటి యుద్ధం.. ఎంపీ vs ఎమ్మెల్యే
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి రజిని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మధ్య విభేదాలు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి మంత్రి రజినితో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు సఖ్యత లేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ నుమొదటినుంచి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇదే మంత్రి రజిని ఎంపీ మధ్య విభేదాల కారణమైంది. తర్వాత ఎంపీ, మంత్రి వర్గాల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడం నియోజకవర్గంలో రొటీన్ గా మారాయి. ఎంపీ కనీస సమాచారం లేకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ మంత్రి రజిని వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఈ నేపథ్యంలోనే నాలుగైదు సార్లు ఎంపీ, మంత్రి వర్గాలు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయు.