Kiran Royal: రోజా భాగోతం బయటపెడుతాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు
ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజాపై తిరుపతి నియోజకవర్గ జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా గ్లిజరిన్ పూసుకొని ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. తన మనోభావాలు దెబ్బతిన్నాయని వెక్కి వెక్కి ఏడ్చిన రోజాకు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని విమర్శించిన సమయంలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలియలేదా అని ప్రశ్నించారు.