Kuala Lumpur: కౌలాలంపూర్లో మురుగు కాల్వలో పడి కుప్పం మహిళ గల్లంతు!
ప్రమాదవశాత్తు ఫుట్పాత్ కుంగి మురుగుకాల్వలో పడిపోవడం వల్ల ఏపీ కుప్పానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ గల్లంతయ్యింది. విజయలక్ష్మి తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. అధికారులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.