Madhyapradesh: రెండు వర్గాల మధ్య కాల్పులు...ఐదుగురు మృతి, 6గురికి గాయాలు..!!
మధ్యప్రదేశ్లోని దాతియాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండా గ్రామంలో భారీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. దతియా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అసెంబ్లీ నియోజకవర్గం. బుధవారం ఉదయం పశువులను పొలం నుంచి తరిమి కొట్టే విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారి తీసింది.