Lunar Eclipse 2023: ఎల్లుండే చంద్రగ్రహణం.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28, శనివారం అశ్వయుజ మాసం పౌర్ణమి రోజు ఏర్పాడుతుంది. అశ్వయుజ మాసం పౌర్ణమి తిథిని శరద్ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ చంద్ర గ్రహణ ప్రభావం మన దేశంలోనూ ఉంటుంది. దీని కారణంగా దాని సూతక్ కాలం చెల్లుతుంది. వేద పంచాంగం ప్రకారం, ఈ చంద్రగ్రహణ అక్టోబర్ 28 తెల్లవారుజామున 01:06 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2:22 వరకు కొనసాగుతుంది. సూతక్ కాలం గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ విధంగా, సూతక్ అక్టోబర్ 28 సాయంత్రం 4:44 నుండి ప్రారంభమై గ్రహణం ముగిసే వరకు కొనసాగుతుంది.