Vizag: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ..
విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.