Liquor Prices Hike In Telangana | పెరిగిన మద్యం రేట్లు...బాధలో మందుబాబులు | CM Revanth | RTV
తెలంగాణలో ఎన్నికల పండుగ ఎఫెక్ట్ కారణంగా మద్యం విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. రోజుకు రూ. 188 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇది రూ. 200 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు 4 శాతం మద్యం విక్రయాలు పెరగగా.. బీర్ల విక్రయాలు మాత్రం ఏకంగా 13 శాతం పెరిగాయి. దసరా, దీపావళి పండుగలు, అసెంబ్లీ ఎన్నికలే మద్యం విక్రయాల పెరుగుదలకు కారణం అని భావిస్తున్నారు అధికారులు.