ఐరాస వేదికపై ప్రసంగించనున్న ఏపీ విద్యార్థినులు....!
ఏపీ(ap) కి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రపంచ వేదికపై ప్రసంగించనున్నారు. ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థులకు ఐరాస(uno)లో ప్రసంగించే అవకాశం రావడంతో ఆ విద్యార్థులపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎం. శివలింగమ్మ, సీ. రాజేశ్వరిలు ఐరాస సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు.