Rinku Singh: ఈ కుర్రాడిని సానపెడితే మరో యువరాజ్, ధోనీ అవుతాడు భయ్యా! రాసి పెట్టుకోండి!
చివరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉంటే వరుస పెట్టి 5సిక్సులు కొట్టి ఐపీఎల్లో కోల్‌కతాకు మరుపురాని విజయాన్ని అందించిన రింకు సింగ్‌పై మాజీ ప్లేయర్ కిరణ్ మోరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకు సింగ్‌ని సానపెడితే యువరాజ్, ధోనీలాగా టీమిండియాకు మ్యాచ్‌లను ఫినిష్ చేయగలడన్నాడు. ఇక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకోని రింకు సింగ్‌ని అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ చేయాలని మాజీలు సూచిస్తున్నారు. ప్రస్తుతం రింకు సింగ్ ఐర్లాండ్ టూర్లో ఉన్నాడు.