India Vs China: చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి.. డ్రాగన్ తోక వంకరే!
ఓవైపు ఇండియా-చైనా మధ్య శాంతి చర్చలు జరుగుతుండగానే మరోవైపు డ్రాగన్ మాత్రం తనపని తాను చేసుకుపోతోంది. సరిహద్దుల్లో నిర్మాణాలు చేపడుతోంది. సరిహద్దులో వేగంగా రోడ్లు,శాశ్వత సైనిక గూడారాల నిర్మాణం చేపడుతున్నట్టు తాజాగా ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. ఫొటోలల్లో భారీ యంత్రాలు, ట్రక్కులు కనిపిస్తున్నాయి.