భరత్ కెనడా మధ్య భగ్గుమన్న విబేధాలు
కెనడా భారత్తో సత్సంబంధాలను చెడగొట్టుకుంది. ఖలిస్థాన్ ఉగ్రవాదిని హతమార్చడం వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అలాంటి ఆరోపణలను భారత్ ఖండించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. ఇండియా పరువు తీసేందుకు కెనడా చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్ కెనడాకు సపోర్టు చేయలేదు. భారత్ విషయంలో కెనడా వైఖరి తప్పని చెప్పకనే చెప్పాయి. భారత్ పరువు తీయాలనుకున్న కెనడా తన పరువు తానే తీసుకున్నట్లయ్యింది.