మిస్సింగ్ మిస్టరీ.. ఐఐటీ విద్యార్థిపై లుక్అవుట్ నోటీసులు..
హైదరాబాద్లో (hyderabad) చదువుతున్న ఐఐటీ విద్యార్థిపై( iit student) విశాఖలో లుక్ అవుట్ నోటీస్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన దనావత్ కార్తిక్ నాయక్ హైదరాబాద్ ఐఐటీలో చదువుతున్నాడు. అయితే అతడు ఎవరికీ చెప్పకుండా కాలేజీ నుంచి వెళ్లిపోయాడు. కార్తీక్ ఈనెల 17న కాలేజీ నుంచి బయటకి వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి విశాఖపట్టణం (vizag) వెళ్లాడు.