Ganesh Immersion: గణనాథుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం.. హుస్సేన్ సాగర్లో ఏర్పాట్లు ఇవే..
భాద్రపద శుద్ధ చవితి రోజున భూలోకానికి విచ్చేసి.. తిమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకుని, వారు అర్పించిన నైవేద్యాలను ఆరగించిన గణపయ్య.. కైలాసానికి తిరుగుపయనమయ్యేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నాడు బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరనున్నాడు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో గణనాథుల విగ్రహాల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.