CJI: మహిళల మీద వివక్ష చూపించే మూసపదాలు వద్దు..!!
న్యాయస్థానాల్లో మహిళ పట్ల వివక్షలేకుండా చూసే విషయంలో కీలక అడుగు పడింది. విచారణ సందర్భంలో మహిళ ప్రస్తావనలో వాడాల్సిన పదాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. కోర్టు తీర్పుల సమయంలో అనుచిత వ్యాఖ్యలు వాడకుండా ఉండేందుకు న్యాయమూర్తులకు తగు సూచనలు చేశారు.