భారత్, కెనడా మధ్య ముదురుతున్న వివాదం..కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం విడిచిపోవాలని ఆదేశం..!!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటనపై భారత్ తీవ్రంగా మండిపడుతోంది. కెనడా హైకమిషనర్ కెమెరూన్ మెక్కేను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. కెనడా దౌత్యవేత్తను భారత్ నుంచి బహిష్కరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో ఉన్న కెనడా హైకమిషనర్‌ను పిలిచి ఐదురోజుల్లోగా దేశం విడిచిపోవాలని ఆదేశించారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
/rtv/media/media_library/e51206e5311e5a1b6b2584179077611283fc201a27d01a4b64b50d6b9a69e9f8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/justin-trudeau--jpg.webp)