సీఎంకు ఈడీ నోటీసులు.... 14న విచారణకు హాజరు కావాలని ఆదేశం...!
జార్ఖండ్ ముఖ్య మంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు పంపింది. మనీలాండరింగ్ కేసులో ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఆయన్ని ఈడీ ఆదేశించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయన్ని ఈడీ విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. ఈ కేసులో రాంచీలోని ఈడీ కార్యాయలంలో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్టు నోటీసుల్లో పేర్కొంది.