Tirupati: తిరుపతి ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఒక్కసారిగా దంచికొట్టిన వర్షం..!
తిరుపతిలో అకాల వర్షం ఒక్కసారిగా దంచికొట్టింది. నిన్నటి వరకూ 45 డిగ్రీల వరకు ఎండలు, వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఒక్కసారిగా వాతావరణం మారడంతో ప్రజలు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు.