మత్స్యకారుల చేపల వేటకు బ్రేక్..
నేటి నుంచి మరో 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.ఆ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వివరించారు.
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వరకు వ్యాపించిందని అధికారులు తెలిపారు.