Gold Rate Today: అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే..
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ ఇది. గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవాళ రూ. 150 డౌన్ ఫాల్ అయ్యింది. దాంతో పుత్తడి ధర మళ్లీ రూ. 59,950 లకు చేరింది. దేశీయ మార్కెట్లో బంగారం ధర అక్టోబర్ 18న ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం(24 క్యారెట్స్) రూ. 59,950 వద్ద ట్రేడ్ అవుతుంది.