Chandrababu: 'నన్ను ఆయన అర్ధం చేసుకున్నారు'.. గద్దర్ ఇంటికి చంద్రబాబు!
పేదల హక్కుల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. గద్దర్ మరణం బాధ కలిగించిందన్నారు. గద్దర్ కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగిన సమయంలో సీఎంగా చంద్రబాబే ఉన్నారు.