America Woman : అమెరికా మహిళను అడవిలో గొలుసుతో కట్టేసి..!
మహారాష్ట్రలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ (50) ను గుర్తు తెలియని వ్యక్తులు అడవిలో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.