Telangana Jobs : ఎన్నికల ఎఫెక్ట్.. గ్రూప్ -2తో పాటు ఆ పరీక్షలన్నీ వాయిదా?
తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. దీంతో రాష్ట్రంలో జరిగే పలు పరీక్షలు వాయిదే పడే ఛాన్స్ ఉంది. నవంబర్ లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్ష రెండోసారి వాయిదాపడనుంది. దీంతో అదే నెలలో జరగాల్సి ఉన్న డీఎస్సీ పరీక్ష కూడా వాయిదా పడే ఛాన్స్ ఉంది. అయితే డీఎస్సీ మొత్తం వాయిదా వేయాలా...లేదంటే ఎస్జీటీ పరీక్ష మాత్రమే పోస్ట్ పోన్డ్ చేయాలన్న విషయంపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవల్సి ఉంది.